గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
APPSCఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ మొదటి పేపర్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ నిర్వహించనున్నారు. 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించారు. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు వాయిదా వేయాలని నిన్న రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం కూడా వాయిదా వేయడానికి కట్టుబడి ఉన్నామంటూనే లీకులతో అభ్యర్థులను మభ్యపెట్టిందనే విమర్శలున్నాయి. ఇంతటి గందరగోళంలో పరీక్షలు రాయడం గతంలో ఎన్నడూ జరగలేదని విశ్లే షకులు అభిప్రాయపడుతున్నారు.