ఉత్సాహంగా తనైరా శారీ రన్
సుప్రసిద్ధ బ్రాండ్ 'తనైరా'.. బెంగళూరు ఫిట్‌నెస్ కంపెనీ 'జేజే యాక్టివ్'తో భాగస్వామ్యం చేసుకుని ఒక ఉత్సాహభరితమైన మార్నింగ్ రన్ నిర్వహించింది
హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాఆలో తనైరా శారీ రన్ నిర్వహించారు. పలువురు మహిళలు, యువతులు చీరకట్టులో పాల్గొన్నారు. డ్యాన్స్‌లు చేస్తూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. టాటా సంస్థకు చెందిన సుప్రసిద్ధ బ్రాండ్ 'తనైరా'.. బెంగళూరు ఫిట్‌నెస్ కంపెనీ 'జేజే యాక్టివ్'తో భాగస్వామ్యం చేసుకుని ఒక ఉత్సాహభరితమైన మార్నింగ్ రన్ నిర్వహించింది. దేశమంతటా ప్రాచుర్యం పొందిన అద్భుతమైన నేత వస్త్రాలను ధరించిన 3120 మంది మహిళలు దూసుకుపోవడంతో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా అంతా రంగుల వాతావరణం నెలకొన్నది. తనైరా శారీ రన్ హైదరాబాద్ ఎడిషన్‌ను జేజే యాక్టివ్ నుంచి కోచ్ ప్రమోద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం గురించి తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ.. తనైరా శారీ రన్ మహిళల బలం, స్ఫూర్తిని జరుపుకుంటుంది. చీరను దయ, స్థిరత్వానికి చిహ్నంగా భావిస్తారు. మహిళలు తమ వారసత్వం.. వ్యక్తిత్వాన్ని స్వీకరించేటప్పుడు వారికి సాధికారత కల్పిస్తూనే ఉన్నది. ఉల్లాసభరితమైన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్యం, సమగ్రతను ప్రోత్సహించడం ద్వారా సమాజశక్తిని వెల్లడిస్తుంది.
జేజే యాక్టివ్ నుంచి కోచ్ ప్రమోద్ మాట్లాడుతూ.. జేజే యాక్టివ్ నుంచి కోచ్ ప్రమోద్ మాట్లాడుతూ ..తమ కుటుంబాల శ్రేయస్సు కోసం తమను తాము అంకితం చేసుకునే మహిళలు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం ఒక సవాలుగా భావిస్తారు. తనైరా శారీ రన్ అనేది మహిళలు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి, సాధికారత కల్పించడానికి రూపొందించబడినప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు. గత సంవత్సరం ప్రారంభమైన తనైరా శారీ రన్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనతో హైదరాబాద్ మహిళలు అద్భుతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సంవత్సరం మరింతఎక్కువ మంది హాజరైనందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ రన్‌లో పాల్గొన్న హైదరాబాద్‌లోని మహిళలకు అభినందనలు” అని అన్నారు.