క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు నాకూ ఎదుర‌య్యాయ్‌..! - న‌టి ఆమ‌ని

తాను ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన త‌ర్వాత‌.. అవ‌కాశాలు రావ‌డానికి రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని ఆమ‌ని వెల్ల‌డించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాక‌పోవ‌డ‌మేన‌ని ఆమె తెలిపారు.

Advertisement
Update:2023-02-23 08:09 IST

క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య త‌న‌కూ ఎదుర‌య్యింద‌ని న‌టి ఆమ‌ని వెల్ల‌డించారు. శుభ‌ల‌గ్నం, శుభ‌సంక‌ల్పం వంటి అనేక చిత్రాల‌తో త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను చాటుకున్న ఆమ‌ని.. అమాయ‌క‌త్వంతో కూడిన భార్య‌గా, గ‌డుసైన ఇల్లాలుగా అనేక పాత్ర‌ల్లో త‌న‌దైన శైలిలో న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే. గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌కు దూరంగా, న‌ట‌న‌కే ప్రాధాన్య‌త ఇస్తూ అద్భుత న‌టిగా విజ‌య‌వంతంగా ముందుకు సాగిన ఆమ‌ని.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్నారు.

తాజాగా ఆమె త‌న కెరీర్ తొలినాళ్ల‌లో ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను వెల్ల‌డించారు. ఇప్పుడు ప్ర‌పంచ‌మంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారిన క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య అప్పుడూ ఉంద‌ని తెలిపారు. తాను కూడా ఆ స‌మ‌స్య ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.

తాను ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన త‌ర్వాత‌.. అవ‌కాశాలు రావ‌డానికి రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని ఆమ‌ని వెల్ల‌డించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాక‌పోవ‌డ‌మేన‌ని ఆమె తెలిపారు.

ఆడిష‌న్స్ కోసం కంపెనీల‌కు వెళ్లిన‌ప్పుడు కొన్ని కంపెనీల్లో తాను సెలెక్ట‌వ‌డం, కొన్నింటిలో రిజెక్ట్ కావ‌డం జ‌రిగేద‌ని ఆమ‌ని చెప్పారు. కొంత‌మంది మాత్రం చెప్పి పంపిస్తామ‌నేవార‌ని.. అది త‌న‌కు మొద‌ట అర్థ‌మ‌య్యేది కాద‌ని వివ‌రించారు. మేడ‌మ్.. డైరెక్ట‌ర్ గారు మిమ్మ‌ల్ని ర‌మ్మంటున్నారు.. అనేవార‌ని.. ఎందుకు.. అని ప్ర‌శ్నిస్తే.. మేక‌ప్ టెస్ట్ చేయాలంట అనే వార‌ని చెప్పారు. త‌న త‌ల్లితో క‌లిసి వ‌స్తాన‌ని చెబితే.. వ‌ద్దొద్దు ఒంటరిగానే రావాల‌ని చెప్పేవార‌ని ఆమ‌ని తెలిపారు. దీనికి అమ్మ‌.. వెంట‌నే త‌ను ఒంట‌రిగా రాదు.. ఇద్ద‌రం క‌లిసే వ‌స్తామ‌ని చెప్ప‌గా, వ‌ద్దులెండి.. డైరెక్ట‌ర్ గారు వ‌ద్దంటున్నారు అంటూ ఫోన్ క‌ట్ చేసేవార‌ని వివ‌రించారు. ఆ త‌ర్వాత త‌న‌కు దానివెనుక మ‌ర్మం అర్థ‌మైంద‌ని ఆమ‌ని తెలిపారు.

అమ్మ రాకుండా.. త‌న‌నొక్క‌దాన్నే ఎందుకు ర‌మ్మ‌న్నారో ఆ త‌ర్వాత అర్థ‌మైంద‌ని, ఇలా చాలా చోట్ల జ‌రిగింద‌ని వివ‌రించారు. అడ్డ‌దారిలో సినిమాల్లోకి రావ‌డం ఇష్టంలేదు కాబ‌ట్టే.. త‌న‌కు ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టింద‌ని ఆమె వెల్ల‌డించారు.

Tags:    
Advertisement

Similar News