చేసింది తప్పు.. మళ్లీ సమర్థింపు ఒకటా..? వెంకటేష్, రానాపై నెటిజన్లు ఫైర్

ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. అందరికీ తాను ఒక ఫ్యామిలీ హీరోగానే తెలుసని, అయితే ఇప్పుడు కాస్త టర్న్ తీసుకున్నా.. అని వెంకటేష్ వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2023-03-24 16:34 IST
చేసింది తప్పు.. మళ్లీ సమర్థింపు ఒకటా..? వెంకటేష్, రానాపై నెటిజన్లు ఫైర్
  • whatsapp icon

వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ ఇటీవల ప్రసారమైంది. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దీనికి దర్శ‌కత్వం వహించారు. అయితే ఈ వెబ్ సిరీస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది వెబ్ సిరీస్ లా లేదని.. బ్లూ ఫిల్మ్‌లా ఉందని పలువురు విమర్శించారు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఇటువంటి పోర్న్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో నటిస్తారని అనుకోలేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు.

రానా నాయుడు వెబ్ సిరీస్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వెంకటేష్ స్పందించారు. రానాతో కలసి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి వెబ్ సిరీస్ లో నటించడం తనకు చాలా కొత్త అని చెప్పారు. ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. అందరికీ తాను ఒక ఫ్యామిలీ హీరోగానే తెలుసని, అయితే ఇప్పుడు కాస్త టర్న్ తీసుకున్నా.. అని వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ పాత్రను తాను పోషించగలనని దర్శకులు నమ్మినందుకు సంతోషంగా ఉందని, అందుకే తన వంతుగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు వెంకటేష్ తెలిపారు.

రానా మాట్లాడుతూ.. బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇప్పుడు ఆయనతో కలిసి వెబ్ సిరీస్ లో నటించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఏదైనా విభిన్నంగా అందరికీ గుర్తుండి పోయాలా చేయాలనుకుని.. ఈ సిరీస్ లో నటించినట్లు చెప్పారు. రానా నాయుడు ఒక భిన్నమైన ఫ్యామిలీ డ్రామా అని రానా పేర్కొన్నారు. కాగా.. వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించి ఇన్నాళ్లు సంపాదించుకున్న ఫ్యామిలీ ఇమేజ్ ని పోగొట్టుకున్నాడని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దానికి కౌంటర్ గానే వెంకటేష్.. తాను ఫ్యామిలీ హీరోగానే అందరికీ తెలుసని, అయితే ఇప్పుడు టర్న్ తీసుకున్నానన్న కామెంట్స్ చేశాడని తెలుస్తోంది.

ఇది తప్పు కదా వెంకీ..? నెటిజన్ల ఫైర్

పోర్న్ కంటెంట్ ఉన్న ఒక వెబ్ సిరీస్ లో వెంకటేష్ నటిస్తాడని ఎవరూ అనుకోలేదు. వెంకటేష్ ఉన్నాడు కదా.. అని కుటుంబ సమేతంగా టీవీలో సిరీస్ ను చూడటం మొదలుపెట్టి.. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అందులోని బూతు కంటెంట్ ను చూడలేక టీవీలు ఆఫ్ చేస్తున్నారు. ఇటువంటి వెబ్ సిరీస్ లో వెంకటేష్ నటించడం ఏంటి..? అని ఆయన ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సిరీస్ లో నటించి తప్పు చేశానని వెంకటేష్ అంటారని అందరూ భావిస్తున్న తరుణంలో దానికి భిన్నంగా వెంకటేష్ స్పందించారు. తాను యాక్టర్ గా టర్న్ తీసుకున్నట్లు వెంకీ వ్యాఖ్యానించారు.

వెంకటేష్ చేసిన తాజా కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మామూలుగా వెంకటేష్ ఒక సినిమా చేస్తే ఇచ్చే పారితోషికం కన్నా డబుల్ పేమెంట్ ఈ సిరీస్ కోసం ఇచ్చారని.. అందుకే వెంకీ ఇటువంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని కొందరు నెటిజన్లు విమర్శించారు. డబ్బు ఇస్తున్నారని.. గడ్డి తింటారా..? ఏమైనా చేస్తారా..? ఇటువంటి సిరీస్ లు చేసి యువతను తప్పు దోవ పట్టిస్తారా..? అని మరి కొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు. చేసిన తప్పు తెలుసుకుని ఇటువంటి సిరీస్ లో నటించడం తప్పు అని ఒప్పుకోకుండా మళ్లీ దాన్ని సమర్థించుకోవడంపై వెంకటేష్, రానాలపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News