మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని.. ప్రియుడి మర్మాంగం కోసేసింది..
మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అతను.. ఇటీవలే ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ నెల 23న అతనికి వేరొక యువతితో పెళ్లి జరగబోతోందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె ప్రియుడిపై కక్ష తీర్చుకోవాలని భావించింది.
వారిది బిహార్ రాష్ట్రం. ఆ యువకుడు, యువతి ఇద్దరూ బంధువులే. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు తీవ్ర మనస్తాపంతో కుంగిపోయింది. నమ్మిన ప్రియుడే వంచించాడనే ఆలోచన ఆమెను ఆగ్రహంతో రగిలిపోయేలా చేసింది.
సదరు ప్రియుడు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అతను.. ఇటీవలే ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ నెల 23న అతనికి వేరొక యువతితో పెళ్లి జరగబోతోందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె ప్రియుడిపై కక్ష తీర్చుకోవాలని భావించింది.
బిహార్‌లోని పట్నాలో గల ఓ హోటల్‌కు ప్రియుడిని రప్పించింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటనతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.