రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ. 12.75 లక్షల వరకు నో పన్ను
Advertisement
ఆదాయ పన్ను గురించి కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్నును మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ. 12.75 లక్షల వరకు పన్ను ఉండదు. రూ. 18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ. 70 వేల వరకు లబ్ధి చేకూరనున్నది. రూ. 25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ. 1.10 లక్షల వరకు లబ్ధి కలగనున్నది.తాజా నిర్ణయంతో మధ్యతరగతి ప్రజానీకానికి ట్యాక్స్ రిలీఫ్ దక్కనున్నది.
కొత్త పన్ను శ్లాబుల సవరణ
రూ. 0-4 లక్షలు-సున్నా
రూ. 4-8 లక్షలు-5 శాతం
రూ. 8012 లక్షలు-10 శాతం
రూ. 12-16 లక్షలు-15 శాతం
రూ. 16-20 లక్షలు-20 శాతం
రూ. 20-24 లక్షలు-25 శాతం
రూ. 24 లక్షలపైన 30 శాతం పన్ను విధిస్తారు.
Advertisement