కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి
Advertisement
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా ఆమె 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. అంతకుముందు నిర్మలా సీతారామన్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి బడ్జెట్ ప్రతిని అందజేశారు. ఈ పద్దుపై పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది.
Advertisement