14ం కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్

ఈ బడ్జెట్‌ ప్రజల జేబులు నింపుడానికి, సేవింగ్స్‌ పెంచడానికి అన్న ప్రధాని

Advertisement
Update:2025-02-01 16:21 IST

కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌ మూడోసారి కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్‌ అని కొనియాడారు. దీంతో పొదుపు , పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్‌ భారత్‌ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్‌ ముఖ్యమైన మైలురాయి. ఇది 14ం కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్‌. అనేక రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానా నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్‌ మాత్రం ప్రజల జేబులు నింపడానికి, సేవింగ్స్‌ పెంచడానికి ఉద్దేశించింది. ఈ బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులు తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం అన్నారు.

నిర్మలా సీతారామన్‌ కు మోడీ కృతజ్ఞతలు

పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ నిర్మలా సీతారామన్‌ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. బడ్జెట్‌ చాలా బాగుంది అని మోడీ ఆమెతో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రధాని మోడీ హృదయంలో మధ్యతరగతి

మరోవైపు బడ్జెట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రధాని మోడీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడలో దోహదపడుతుందిని ట్వీట్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News