కేంద్ర బడ్జెట్: ముఖ్యాంశాలు
గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి అన్న ఆర్థికమంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా ఆమె 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఆర్థిక మంత్రి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి అన్నారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడల సాధన లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందన్నారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు
ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి
- దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం
- గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన
- 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు
- రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
- దీనిద్వారా 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
పప్పుధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
- బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
- కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
- పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం
- అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్
- 2024 జులై నుంచి వందకుపైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
- పత్తి ఉత్పాదకత పెంచడానికి జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్
- పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్
పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్ మిషన్
- అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు.
- అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు.
- పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు.
- ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం.
- విద్యారంగంలో AI వినియోగం ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు.
- బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ. రూ.30 వేలతో స్ట్రీట్ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు.
- బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం
- బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
- బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
- చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్
- కృత్రిమ మేధా అభివృద్ధికి రూ. 500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు
- దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
- వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడుతామని, దీనికి సంబంధించి పూర్తివివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
- జల్ జీవన్ మిషన్‌కు మరిన్ని నిధులు
- ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం
- రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు
- రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
- వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు
- ఆర్థిక రంగానికి మూడో ఇంజిన్‌గా పెట్టుబడులు
- క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
- పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానఫ్యాక్చరింగ్ మిషన్
- కొత్త ఉడాన్ పథకం
- మరో 120 రూట్లలో అమలు
- 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం
- బీహార్ గ్రీనఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయం