బ్రిజ్ భూషణ్ కుమారుడి వాహనం ఢీ- ఇద్దరు యువకుల దుర్మరణం

కరణ్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఇవాళ ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి వాహనదారులపై దూసుకెళ్లడంతో ఎదురుగా బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Advertisement
Update: 2024-05-29 14:31 GMT

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్, ఎంపీ బ్రిజ్ భూషణ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోండా నగర సమీపంలోని రహదారిపై జరిగింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బ్రిజ్ భూషణ్ ఉన్న సమయంలో ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తో రెజ్లర్లు నెలల తరబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో బీజేపీ కైసర్ గంజ్ ఎంపీ టికెట్ బ్రిజ్ భూషణ్ కి ఇవ్వకుండా ఆయన కుమారుడు కరణ్ కి ఇచ్చింది. ఇదిలా ఉంటే కరణ్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఇవాళ ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి వాహనదారులపై దూసుకెళ్లడంతో ఎదురుగా బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

వాహనం ఢీకొని మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కరణ్ ఆ కాన్వాయ్ లో ఉన్నారా?లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News