బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

పర్సనల్‌ లాతో సంబంధం లేకుండా దాన్ని అమలు చేయాలని సూచించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం

Advertisement
Update:2024-10-18 13:37 IST

బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్‌ లాతో సంబంధం లేకుండా దాన్ని అమలు చేయాలని సూచించింది. దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. దీనికిగాను కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్‌ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్య వివాహాల నిరోధకం, మైనర్‌ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.

బాల్యవివాహాలను నివారించాలనే వ్యూహాలు వివిధ వర్గాలకు అనుగుణంగా ఉండాలి. బహుళ రంగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే చట్టం విజయవంతమౌతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులకు దీనిపై శిక్షణ సామర్థ్యాన్ని పెంచాలి. కమ్యూనిటీ ఆధారిత విధానాలు ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో రూపొందించారు. ఈ చట్టాన్ని 1929 నాటి బాల్య వివాహ నిరోధక చట్టం స్థానంలో తీసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News