కెమెరా చేతపట్టి లయన్ సఫారీని సందర్శించిన ప్రధాని మోదీ
నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాన మోదీ లయన్ సఫారీకి వెళ్లి కెమెరాతో సింహాలను పోటోలను తీశారు;
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లో లయన్ సఫారీని ప్రధాని మోదీ సందర్శించారు. కెమెరాతో సింహాలను పోటోలను తీశారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని.. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యానికి వెళ్లారు. కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని ట్వీట్ చేశారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన చర్యల వల్ల ఆసియా సింహాల జనాభ క్రమంగా పెరుగుతోందని తెలిపారు. జంతువుల సంరక్షణకు అటవీ పరిసర ప్రాంత ప్రజల కూడా కృషీ చేయడం ప్రశంసనీయని ప్రధాని పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి సిన్హ్ సదన్ నుంచి సఫారీకి బయల్దేరారు.