వేధిస్తున్నాడని డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె

అసోం మాజీ సీఎం ప్రఫుల్లా కుమార్‌ మహంత కుమార్తె డ్రైవర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌;

Advertisement
Update:2025-03-04 12:42 IST

మద్యం మత్తులో తనను దూషించిన డ్రైవర్‌కు అసోం మాజీ సీఎం కుమార్తె దేహశుద్ధి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ డ్రైవర్‌ మద్యం మత్తులో తనను దూషించడాని ఆరోపిస్తూ అసోం మాజీ సీఎం ప్రఫుల్లా కుమార్‌ మహంత కుమార్తె డ్రైవర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ చెప్పుతో కొట్టారు. ప్రభుత్వ ఎమ్మెల్యే క్వార్టర్లలో ఆమె అతడిని కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆమె మాట్లాడుతూ. ఆ డ్రైవర్‌ తమ వద్ద చాలాకాలంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి తనను దుర్భాషలాడుతూ, వేధిస్తుంటాడని అన్నారు. అయినా కూడా అతనికి ఉన్న సమస్యల వల్ల అలా ప్రవర్తిస్తాడని తాము సహనంతో ఉంటామని.. అలా ప్రవర్తించవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని అసహసనం వ్యక్తం చేశారు. సోమవారం తను ఇంట్లో ఉండగా డోర్‌ను గట్టిగా కొడుతూ.. బైటికి రావాలని దూషించాడని తెలిపార. అందువల్లనే అతనికి తగిన బుద్ధి చెప్పానని అన్నారు. అయితే డ్రైవర్‌ ప్రభుత్వ ఉద్యోగినా లేదా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తా అనే విషయంపై స్పష్టత లేదు.

అసోం గణపరిషత్‌ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్‌ మహంత రెండుసార్లు అసోం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. కానీ వారి కుటుంబం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో నివాసం ఉండటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News