అసెంబ్లీలో గుట్కా తిని ఊసిన ఎమ్మెల్యే..వీడియో ఇదిగో

ఓ ఎమ్మెల్యే గుట్కా తిని అసెంబ్లీ హాల్ ఎంట్రీ మెట్ల వద్ద ఊసాడు.;

Advertisement
Update:2025-03-04 16:07 IST

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే గుట్కా తిని అసెంబ్లీ హాల్ ఎంట్రీ మెట్ల వద్ద ఊసాడు. యూపీ స్పీకర్ సతీశ్ మహానా శాసన సభలోకి వెళ్తుండగా.. ఆ విషయాన్ని గుర్తించాడు.వెంటనే భద్రతా సిబ్బందిని పిలిపించి ఈ విషయంపై ఆరా తీశారు. ఓ ఎమ్మెల్యే గుట్కా తింటూ వచ్చారని, సరిగ్గా మెట్ల వద్ద ఊశారని భద్రతా సిబ్బంది గుర్తించి స్పీకర్‌కు చెప్పగా..

ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్చందంగా ముందుకు వచ్చి అంగీకరించకపోతే తానే బయటపెడతానని హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ ఎమ్మెల్యే ఇలా చేసినట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలు సహించబోమని సభాపతి హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags:    
Advertisement

Similar News