రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని ఎత్తివేస్తాం - రాహుల్ గాంధీ

అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామన్న రాహుల్‌.. తద్వారా సమాజంలో వెనుకబడిన కులాలకు వారి హక్కులు లభిస్తాయన్నారు.

Advertisement
Update:2024-02-06 11:22 IST

కాంగ్రెస్‌ లీడర్‌, రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడంతో పాటు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా ప్రస్తుతం జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ.

ప్రధాని మోడీ స్వయంగా తాను ఓబీసీనని చెప్పుకుంటారని.. కానీ ఓబీసీల హక్కుల అంశం ప్రస్తావిస్తే దేశంలో పేద, ధనిక రెండే కులాలు ఉంటాయని చెప్తారని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఓబీసీలైనా, దళితులైనా, గిరిజనులైనా కులగణన చేయనిదే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం దక్కదన్నారు. చాలా అంశాలపై మాట్లాడే మోడీ.. కులగణన అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు రాహుల్.

అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామన్న రాహుల్‌.. తద్వారా సమాజంలో వెనుకబడిన కులాలకు వారి హక్కులు లభిస్తాయన్నారు. దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లలో ఎలాంటి తగ్గింపు ఉండదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం ఈ దేశంలో అతిపెద్ద సమస్యగా అభివర్ణించారు.

Tags:    
Advertisement

Similar News