ప్రాజెక్టుల పూడికతీతలో జాతీయ విధానం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Advertisement
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీయడంలో జాతీయ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2022 అక్టోబర్ లో జారీ చేసిన గైడ్‌లైన్స్ కు అనుగుణంగా ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పొందే మార్గాలను అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల పూడికతీత కార్యక్రమంలో భాగంగా ఒక ప్రాజెక్టును ఎంపిక చేసి దానిని పైలెట్ ప్రాజెక్టుగా పరిగణించాలని, దాని ఫలితాలకు అనుగుణంగా మిగతా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.
Advertisement