విశాల్, మోడీ మధ్యలో ప్రకాష్ రాజ్

విశాల్, ప్రధాని మోడీ మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ కాన్వర్జేషన్‌ను పరోక్షంగా యాక్టింగ్‌గా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. అందుకే షాట్ ఓకే.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు.. అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

Advertisement
Update:2022-11-03 15:47 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తిన తమిళ స్టార్ హీరో విశాల్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు. విశాల్ ఇటీవల ఇటీవల కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం విశాల్ కాశీ అభివృద్ధిపై మోడీని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. 'ప్రియమైన మోడీజీ నేను కాశీ సందర్శించాను. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది. గతంతో పోలిస్తే కాశీ బాగా అభివృద్ధి చెందింది. కాశీ ప్రయాణం కూడా సులభంగా మారింది. ఆలయాలను పునరుద్ధరిస్తున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు' అని ట్వీట్ చేశాడు.

విశాల్ చేసిన ట్వీట్‌కి ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. 'మీరు కాశీలో అద్భుతమైన అనుభవం పొందినందుకు ఆనందంగా ఉంది' అని రిప్లై ఇచ్చారు. కాగా విశాల్ ప్రధానికి ట్వీట్ చేయడం.. ఆయన స్పందించిన నేపథ్యంలో విశాల్‌పై ప్రకాష్ రాజ్ వ్యంగంగా ట్వీట్ చేశారు. విశాల్‌ని ట్యాగ్ చేస్తూ 'షాట్ ఓకే.. నెక్స్ట్ ' అంటూ ట్వీట్ చేశారు. విశాల్, ప్రధాని మోడీ మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ కాన్వర్జేషన్‌ను పరోక్షంగా యాక్టింగ్‌గా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. అందుకే షాట్ ఓకే.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు.. అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ప్రకాష్ రాజ్‌కు మొదటి నుంచి బీజేపీపై వ్యతిరేకత ఉంది. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలపై తరచూ ఆయన విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రధానిని పొగిడిన విశాల్‌పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు.

కాగా, తమిళనాడులో సినిమా సంఘం అయిన నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్‌కు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. జయలలిత మరణించిన తర్వాత అన్నా నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు రాగా విశాల్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆయన దాఖలు చేసిన నామినేషన్‌లో లోపాలు ఉన్నాయని ఎన్నికల సంఘం తిరస్కరించడంతో విశాల్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని అప్పట్లోనే విశాల్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో విశాల్ ప్రధానమంత్రిని పొగడటం ద్వారా బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News