అంబేద్కర్ మనవడుకు తీవ్ర అస్వస్థత
భారత రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
భారత రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున ప్రకాశ్ అంబేద్కర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే పూణేలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. హార్ట్‌లో బ్లడ్ క్లాడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాసేపట్లో యాంజియోగ్రఫీని వైద్యులు చేయనున్నట్లు తెలిపారు.
ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన రాజకీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రకాశ్ అంబేద్కర్ మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు డాక్టర్లుల పర్యవేక్షణలో ఉంటారని వీబీఏ మహారాష్ట్ర అధ్యక్షుడు రేఖా తాయ్ ఠాకూర్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వీబీఏను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ఏడాది మార్చి నుంచి ప్రకాశ్ అంబేద్కర్ విరామం తీసుకోకుండా పర్యటనలు చేస్తున్నారు. ఆయనకు వయస్సు ప్రస్తుతం 70 ఏళ్లు.