న‌న్ను సీఎంని చేయండి.. 150 ఏళ్లు జీవించే ర‌హ‌స్యం చెబుతా.. - ఏఐఎస్ఎంకే అధ్యక్షుడు శరత్ కుమార్

ప్ర‌స్తుతం 69 ఏళ్ల వ‌య‌సున్న తాను 150 ఏళ్ల వ‌ర‌కు జీవించేందుకు ర‌హ‌స్యాన్ని క‌నుగొన్నాన‌ని శ‌ర‌త్‌కుమార్ తెలిపారు. 2026లో జ‌రిగే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని కోరుతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు.

Advertisement
Update:2023-05-30 10:43 IST

అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి (AISMK) అధ్య‌క్షుడు శ‌ర‌త్‌కుమార్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `న‌న్ను ముఖ్య‌మంత్రిని చేయండి.. 150 ఏళ్లు జీవించే ర‌హ‌స్యం చెబుతా..` అని ఆయ‌న అన్నారు. మదురై పళంగానత్తంలో సోమ‌వారం జ‌రిగిన పార్టీ బహిరంగ సభలో ప్ర‌జ‌లనుద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దేశంలోని యువ‌శ‌క్తిని నియంత్రించేందుకు విదేశాల కుట్ర‌..

మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలగజేస్తుందని ఈ సంద‌ర్భంగా ఏఐఎస్ఎంకే పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ చెప్పారు. 2025 నాటికి అత్యధిక యువ‌త‌తో కూడిన దేశంగా భారత్ మారుతుందని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేయాలి..

ప్ర‌స్తుతం 69 ఏళ్ల వ‌య‌సున్న తాను 150 ఏళ్ల వ‌ర‌కు జీవించేందుకు ర‌హ‌స్యాన్ని క‌నుగొన్నాన‌ని శ‌ర‌త్‌కుమార్ తెలిపారు. 2026లో జ‌రిగే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని కోరుతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి ఈ సంద‌ర్భంగా విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News