అమెరికా ఎవరిని మోసం చేయాలనుకుంటోంది.... పాక్ కు ఆయుధాల సరఫరాపై భారత్ ఆగ్రహం

అమెరికా పాకిస్తాన్ సంబంధాలపై భారత్ విరుచుక పడింది. అమెరికా ఎఫ్-16 విమానాల విడిభాగాలను పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఘాటుగా స్పందించారు.

Advertisement
Update:2022-09-26 19:18 IST

అమెరికా పాకిస్తాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్-16 విమానాల విడిభాగాలను సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల భారత్ మండిపడింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఘాటుగా స్పందించారు.

వాషింగ్టన్ లో భారతీయ అమెరికన్ల సభలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు కోసమే తానీ నిర్ణయం తీసుకున్నానని అమెరికా చెబుతోంది. ఈ వాదన ఎవరినిమోసం చేయడానికి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-పాకిస్థాన్ సంబంధాల వెనకున్న ప్రాతిపదిక ఏమిటి ? అని ఆయన ప్రశ్నించారు.

''ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉపయోగిస్తారా లేక యుద్దానికి ఉపయోగిస్తారా ? పాకిస్తాన్ ఈ యుద్ద విమానాలను ఎక్కడ మోహరిస్తుందో మీకు తెలియదా ? అమెరికా ప్రభుత్వ పెద్దలతో ఎవరితోనైనా నేను మాట్లాడడం జరిగితే... మీరేం చేస్తున్నారో మీకు అర్దమవుతుందా అని అడుగుతాను" అని జైశంకర్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News