ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్
క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.
శ్వాస కోశ సమస్యతో క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రాంకైటీస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన్ను రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రికి తరలించినట్లు వాటికన్ అధికారులు తెలిపారు. 86 ఏళ్ల పోప్‌కు కరోనా వైరస్ సోకలేదని వాటికన్ సిటీ ప్రతినిధి మాటియో బ్రూనీ స్పష్టం చేశారు. 2021 జూలైలో పెద్దపేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పోప్.. తర్వాత మళ్లీ చేరడం ఇదే తొలిసారి. 86 ఏళ్ల పోప్‌కు కరోనా వైరస్ సోకలేదని వాటికన్ సిటీ ప్రతినిధి మాటియో బ్రూనీ స్పష్టం చేశారు. 2021 జూలైలో పెద్దపేగు సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పోప్.. తర్వాత మళ్లీ చేరడం ఇదే తొలిసారి. ఆయన అనారోగ్యంపై వార్తలు బయటకు రాగానే.. త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపుతున్నారు పలువురు. గత కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా పలు ముఖ్యకార్యక్రమాలకు ఆయన గైర్హాజరు అవుతున్నారు.