ట్రంప్, పుతిన్‌ల మధ్య చర్చలకు మార్గం సుగమం
సౌదీ అరేబియాలో మంగళవారం అమెరికా, రష్యా ఉన్నతాధికారుల మధ్య చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమమవుతున్నది. ఈమేరకు సౌదీ అరేబియా వేదికగా రెండు దేశాల ఉన్నతాధికారులు మంగళవారం చర్చలు జరపనున్నారు. అమెరికా, రష్యాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సహా, ఉక్రెయిన్ అంశంపై చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష భవన క్రెమ్లిన్ ఒక ప్రకనలో వెల్లడించింది. అమెరికా ఉన్నతాధికారులతో చర్చల కోసం రష్యా విదేశాంగ శాఖమంత్రి, క్రెమ్లిన్ అధికార ప్రతినిధితో పుతిన్ ముఖ్య సలహాదారుడు సౌదీ అరేబియా వెళ్తున్నారు. మొదటగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాల పునరుద్ధరణ పై చర్చలు జరుగుతాయన్న రష్యా, తర్వాత ఉక్రెయిన్‌తో ముగింపు పలకడం పుతిన్, ట్రంప్ సమావేశంపై దృష్టి సారిస్తామని తెలిపింది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియతో కూడిన బృందం రష్యా ప్రతినిధులతో చర్చల కోసం సౌదీఅరేబియా వెళ్లింది. ఈ చర్చలకు తమను ఆహ్వానించలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్ఆనరు. తాము భాగంగా లేని సమావేశాల ఫలితాలన అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్యే జెలెన్ స్కీ బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.