భగవద్గీత సాక్షిగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ ప్రమాణం
కాష్ పటేల్ తో ప్రమాణం చేయించిన అటార్నీ జనరల్
Advertisement
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా కాష్ పటేల్ భగవద్గీత పై ప్రమాణం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ను నియమించారు. పటేల్ తో అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రమాణం చేయించారు. కాష్ పటేల్ పుర్వీకులది గుజరాత్.. అమెరికాలోనే పుట్టిపెరిగిన కాష్ పటేల్ ట్రంప్ కు అత్యంత నమ్మకస్తుడు. అందుకే పలువురు వ్యతిరేకిస్తున్నా ఆయనను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కాష్ మాట్లాడుతూ.. ఎఫ్‌బీఐ చేసే పనులకు జవాబుదారీతనం ఉంటుందన్నారు. ఎఫ్‌బీఐ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న వెయ్యి మంది ఉద్యోగులను దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.
Advertisement