కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటిన నాయకులు
హైదరాబాద్ తో పాటు న్యూజిలాండ్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 71వ బర్త్ డే సందర్భంగా వృక్షార్చనలో భాగంగా నగరంలోని జలగం వెంగళరావు పార్కులో బీఆర్‌ఎస్ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చారని అన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, దేవి ప్రసాద్, ముజీబుద్దిన్, గూడూర్ ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, జూలూరి గౌరీ శంకర్, మెట్టు శ్రీనివాస్, సుమిత్ర ఆనంద్, రజిని సాయిచంద్, మంత్రి శ్రీదేవి, మన్నె కవిత, చిరుమిళ్ల రాకేష్, ఆంజనేయులు గౌడ్, గజ్జెల నగేష్, వాసుదేవ రెడ్డి, సతీష్ రెడ్డి, పాటిమీది జగన్, ఇంతియాజ్, వాల్యా నాయక్, దామోదర్ గుప్తా, కిషోర్ గౌడ్, ఉపేంద్ర, పల్లె రవి, అక్బర్, నాగేందర్ గౌడ్, మఠం భిక్షపతి, వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు సర్వోత్తమ్, మన్నె గోవర్ధన్, తుంగబాలు, గోసుల శ్రీనివాస్, మెట్టు శ్రీనివాస్, శ్రీధర్, రాఘవేంద్ర యాదవ్, పూర్ణచందర్, సతీష్, ఎన్ ఎన్ రాజు, అమృత్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు
ఆక్లాండ్‌లో మొక్కలు నాటిని న్యూజిలాండ్ నాయకులు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో బీఆర్‌ఎస్ న్యూజిలాండ్ యూనిట్ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రామారావు, కిరణ్ పొకల, అరుణ్ ప్రకాశ్, కళ్యాణ్ రావు, ప్రకాశ్ బిరాదార్, సుధీర్ బాబు రాచపల్లి, మోహన్ రెడ్డి, పీవీఎన్ రావు, శ్రీనివాస్ పుడారి తదితరులు పాల్గొన్నారు.