కరోనా వల్ల మానవాళికి కలిగిన మేలు ఏంటో తెలుసా?

ముందుగా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల లేదా టీకీ వేసుకోవడం వల్ల ఇప్పుడు రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది ఒక రకంగా మంచి విషయమని వైద్యులు చెబుతున్నారు.

Advertisement
Update:2022-12-04 09:33 IST

కరోనా మహమ్మరి ప్రపంచాన్ని గడగడలాడించింది. దేశాలు సరిహద్దులు మూసేసుకున్నాయి. ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం లాక్‌డౌన్లు ఏర్పాటు చేశాయి. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేసిన ఆ పాండమిక్ ఇప్పుడు క్రమంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి యొక్క అత్యవసర దశ దాదాపు ముగింపునకు వచ్చినట్లే, కానీ వైరస్ మాత్రం పూర్తిగా నిర్మూలించబడలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఇంతలా ఇబ్బంది పెట్టిన కరోనా కారణంగా మానవాళికి మేలు కూడా జరిగింది. ఇప్పుడు ప్రపంచ జనాభాలో 90 శాతం మంది కోవిడ్-19 సంక్రమణను నిరోధించే ఇమ్యూనిటీని కలిగి ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

ముందుగా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల లేదా టీకీ వేసుకోవడం వల్ల ఇప్పుడు రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది ఒక రకంగా మంచి విషయమని వైద్యులు చెబుతున్నారు. టీకాలు వేసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గిందని, కొత్తగా రోగ నిరోధక శక్తి పెరిగే పరిస్థితులు సృష్టించబడినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒక ఏడాది పాటు కోవిడ్ నుంచి రక్షణ ఏర్పడినట్లు ఒక పరిశోధనలో తేలింది. ఇప్పటికే ఇమ్యూనిటీ పెరిగిన కారణంగా తరచుగా బూస్టర్ డోసులు వేసుకోవల్సిన అవసరాన్ని కూడా తగ్గించవచ్చని అన్నారు.

రోగ నిరోధక శక్తి వ్యవస్థ బలంగా లేని వారికి, పిల్లలకు టీకాలు తప్పకుండా రక్షణ ఇస్తాయి చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ ఒక ఏడాది పాటు ఊపిరితిత్తుల వ్యాధి నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నాయి. కరోనా కారణంగా లంగ్స్ దెబ్బతినకుండా కాపాడుతున్నాయి. చిన్న పిల్లలకు ఈ టీకాలు మరింత సమర్థవంతంగా పని చేసేలా పరిశోధనలు జరుగుతున్నాయి. జంతువులకు అధిక మోతాదులో వ్యాక్సిన్‌లు అందించి ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ప్రేరేపిత రోగ నిరోధక శక్తి పెరుగుదలను, దాని సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News