స్వదేశానికి బయలుదేరిన ప్రధాని
ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ముగించుకుని భారత్‌కు బయలుదేరిన మోడీ
Advertisement
రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి బయలుదేరారు. ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ప్రతినిధులు ప్రధాని మోడీకి వీడ్కోలు పలికారు. ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించారు. అగ్రరాజ్యంలో ప్రధానికి ట్రంప్ సర్కార్ మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ పర్యటనలో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడేలా రెండుదేశాల నేతలు వాణిజ్యం, రక్షణ, సాంకేతికత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. అమెరికా పర్యటనకు ముందు ఈనెల 10, 11 తేదీల్లో ప్రధాని ఫ్రాన్స్‌లో పర్యటించారు. పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Advertisement