ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ డౌన్... 2 గంటల పాటు ఇబ్బందులు పడ్డ‌ యూజర్లు

ఈ రోజు అనేక దేశాల్లో వాట్సప్ డౌన్ అయిపోయింది. దాదాపు 2 గంటల పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంప లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Update:2022-10-25 13:41 IST

ప్రపంచంలో ప్రస్తుతం వాట్సప్ లేనిదే ఏ పని జరిగే పరిస్థితిలేదు. వ్యక్తి గత చాట్ లూ, బిజినెస్ మీటింగులు.... ఒకటేమిటి ఇప్పుడు వాట్సప్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయలేనిభాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు చాలా పనులు వాట్సప్ మీదనే ఆధారపడి ఉంటున్నాయి. అలాంటి వాట్సప్ కొద్ది సేపు ఆగిపోతే ...? ప్రపంచం అల్లకల్లోలమే. ఇప్పుడు అదే జరిగింది.

ఈ రోజు అనేక దేశాల్లో వాట్సప్ డౌన్ అయిపోయింది.  దాదాపు 2 గంటల పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంప లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక బిజినెస్ ట్రాంజాక్షన్స్ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. వ్యక్తిగత చాట్లు, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పంపడం ప్రస్తుతం అసాధ్యంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు వాట్సాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు 'డౌన్‌డిటెక్టర్' నివేదించింది.వేలకొద్దీ వినియోగదారులకు వాట్సాప్‌ పని చేయడం లేదని అవుటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్'డౌన్‌డిటెక్టర్' నిర్ధారించింది. డౌన్‌డిటెక్టర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ సమస్య ఉంది. భారత్ లో దాదాపు ఎక్కడా వాట్సప్ పని చేయ లేదు.

దీనిపై ట్విట్టర్ లో #whatsappdown అనే హ్యాష్ ట్రాగ్ ట్రెండ్ అవుతోంది. నెటిజనులు వాట్సప్ లేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను పోస్ట్ చేస్తున్నారు. కొందరైతే తమ ఊపిరి ఆగిపోయినట్టుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. వాట్సప్ డౌన్ మీద అనేక మీమ్స్ కూడా ట్విట్ట‌ర్ వైరల్ అవుతున్నాయి.


కాగా వాట్సప్ ఆగిపోవడం పై మెటా సంస్థ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


లేటెస్ట్ న్యూస్: 2 గంటల తర్వాత వాట్సప్ సేవలు పునరిద్దరించారు. ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ఆగిపోయిన వాట్సప్ సేవలు తిరిగి 2.15 నిమిషాలకు ప్రారంభమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News