రూ.650 కోట్ల విలువైన ఫైటర్ జెట్ మిస్సింగ్.. దయచేసి జాడ చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి

అమెరికాలోని సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి ఆదివారం బయలుదేరిన ఫైటర్ జెట్‌కు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో పైలెట్ దాంట్లోంటి అత్యవసరంగా ఎగ్జిట్ అయ్యాడు.

Advertisement
Update:2023-09-18 19:23 IST

ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఫైటర్ జెట్‌గా అమెరికాకు చెందిన ఎఫ్-35కు పేరు. లాక్ హీడ్ మార్టిన్ అనే సంస్థ తయారు చేసే ఈ ఫైటర్ జెట్ ఒక్కో దాని విలువ 80 మిలియన్ డాలర్లు (రూ.650 కోట్లకు పైగానే) ఉంటుంది. అమెరికా వాయు సేనలో ఈ ఎఫ్-35 ఫైటర్ జెట్లు చాలా కీలకంగా భావిస్తారు. ఇలాంటి ఫైటర్ జెట్ ఒకటి మిస్ అయ్యింది.

అమెరికాలోని సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి ఆదివారం బయలుదేరిన ఫైటర్ జెట్‌కు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో పైలెట్ దాంట్లో నుంచి అత్యవసరంగా ఎగ్జిట్ అయ్యారు. ఆ తర్వాత ఆ ఫైటర్ జెట్ ఎటు వెళ్లింతో ఎవరికీ అంతు చిక్కలేదు. వందల కోట్ల విలువైన ఆ ఫైటర్ జెట్ జాడ లేకుండాపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే పోర్టు నగరమైన చార్లెస్టన్‌లో ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌తో కలిసి పోలీసు అధికారులు ఎఫ్-35ని వెతికే పనిలో పడ్డారు. ఆ నగరంలోని రెండు పెద్ద సరస్సుల్లో గాలిస్తున్నారు. అయితే అధికారులు, పోలీసులు కలిసి వెతికినా జాడ తెలియకపోవడంతో ప్రజలను సాయం అడిగారు. ఎవరికైనా ఆ ఫైటర్ జెట్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు.

80 మిలియన్ డాలర్ల విలువైన ఫైటర్ జెట్ మిస్ అయితే దాన్ని ట్రాక్ చేయలేకపోవడంపై అధికారులపై స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంత విలువైన విమానంలో కనీసం ట్రాకింగ్ పరికరం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులు కూడా అమెరికా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్ ఒక ట్వీట్ చేశారు. ఎఫ్-35 ఎలా మిస్ అయ్యింది. కనీసం అందులో ట్రాకింగ్ డివైజ్ కూడా లేదా? వెంటనే ఆ ఫైటర్ జెన్‌ను వెతకండి అంటూ ట్వీట్ చేశారు. ఆ ఫైటర్ జెట్ నడిపిన పైలెట్ మాత్రం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నార్త్ చార్లెస్టన్ ప్రాంతంలో సురక్షితంగా దిగాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తున్నది. కాగా, దానితో పాటే గాల్లోకి ఎగిరిన మరో ఎఫ్-35 మాత్రం సురక్షితంగా తిరిగి బేస్ స్టేషన్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News