డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్‌.. బెయిల్‌పై విడుద‌ల‌

స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండును సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు.

Advertisement
Update:2023-08-25 08:47 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో పోలీసులు ఆయ‌న్ని అరెస్ట్ చేశారు. కొద్దిసేప‌టి త‌ర్వాత బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోద‌య్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ మేరకు జార్జియా జైల్ వద్ద పోలీసుల ఎదుట ట్రంప్ లొంగిపోయారు. ఇప్పటికే ఆయన స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండును సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు.

ట్రంప్‌పై నాలుగు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు కాగా, అందులో ఈ కేసు కూడా ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం. పోలీసుల ఎదుట లొంగిపోయిన ట్రంప్.. జైలులో 20 నిమిషాలు గడిపి.. అనంత‌రం బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసుల ఎదుట లొంగిపోయినా దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ అరెస్టయ్యారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ చెబుతున్నారు.

*

Tags:    
Advertisement

Similar News