భారతీయ భాషలో అమెరికా ఎన్నికల బ్యాలెట్‌

ఇంగ్లిష్‌ తో పాటు పలు భాషల్లో ముద్రించిన అగ్రరాజ్యం

Advertisement
Update:2024-11-04 16:16 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని గంటల్లోనే మొదలవనుంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ మొదలవగా, మంగళవారం (నవంబర్‌ 5న) పోలింగ్‌ నిర్వహించనున్నారు. యూఎస్‌ లోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు భాషల్లో బ్యాలెట్‌ పేపర్లు ముద్రించి పోలింగ్‌ కు ఉపయోగిస్తున్నారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ప్రింట్‌ చేసిన బ్యాలెట్‌ పేపర్‌ లో ఒక భారతీయ భాషకు చోటు దక్కింది. ఇంగ్లిష్‌ పాటు ఐదు భాషల్లో బ్యాలెట్‌ పేపర్‌ ను ముద్రించగా, అందులో బెంగాలీ భాష కూడా ఉంది. చైనీస్‌, స్పానిష్‌, కొరియన్‌ భాషల్లోనూ బ్యాలెట్‌ పేపర్‌ ప్రింట్‌ చేశారు. అమెరికా ఓటర్లందరికీ ఇంగ్లిష్‌ తెలిసినా.. వారి మాతృభాషలో బ్యాలెట్‌ పేపర్లు ముద్రిస్తే వారు సంతోషిస్తారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. బెంగాలీలో అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ ప్రింట్‌ చేయాలని గతంలో కోర్టులో కేసు దాఖలు చేశారని, అప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే బెంగాలీ భాషకు బ్యాలెట్‌ పేపర్‌ లో చోటు దక్కిందని బెంగాలీ ఎన్‌ఆర్‌ఐలు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News