పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకుంటే నో ఎంట్రీ

భారతీయ పాస్‌పోర్ట్‌లో ఒకే పేరుతో ఉన్న ప్రయాణికులు ఇక‌పై దుబాయ్‌కి వెళ్లాలంటే వారి పాస్‌పోర్టులో ఈ మేర‌కు అప్‌డేట్ చేయించుకోవాల‌ని ఇమిగ్రేష‌న్ అధికారులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Update:2022-11-24 11:47 IST

దుబాయ్ వెళ్లాల‌నే భార‌తీయ ప్ర‌యాణికుల పాస్‌పోర్టులో ఇక‌పై పేరొక్క‌టే ఉంటే అనుమంతించ‌మ‌ని, పేరుతో పాటు, ఇంటిపేరు, చివ‌రి పేరు కూడా త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని దుబాయ్ ఇమిగ్రేష‌న్ అధికారులు స్ప‌ష్టం చేశారు. న‌వంబ‌ర్ 21 నుంచే ఈ కొత్త నిబంధ‌న అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని తెలిపారు.

భారతీయ పాస్‌పోర్ట్‌లో ఒకే పేరుతో ఉన్న ప్రయాణికులు ఇక‌పై దుబాయ్‌కి వెళ్లాలంటే వారి పాస్‌పోర్టులో ఈ మేర‌కు అప్‌డేట్ చేయించుకోవాల‌ని ఇమిగ్రేష‌న్ అధికారులు స్ప‌ష్టం చేశారు. టూరిస్ట్, విజిట్ లేదా మరే ఇతర రకాల వీసాతో ప్రయాణించే వారి పాస్‌పోర్ట్‌లపై ఒకే పేరు ఉంటే దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి వెన‌క్కి రావాల్సిందే. ఈ మేర‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు వ్యాపార‌ భాగస్వామి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. పాస్‌పోర్ట్‌లపై మొదటి పేరు, ఇంటిపేరు కాలమ్‌లలో అప్‌డేట్ చేసుకున్న ప్ర‌యాణికుల‌నే ఇక‌పై ఇండిగో విమానాల్లో కూడా దుబాయ్‌కి అనుమ‌తిస్తామ‌ని ఆ సంస్థ కూడా ప్ర‌క‌ట‌న చేసింది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివరాల కోసం ఇండిగో మేనేజర్‌ను కానీ, goindigo.com వెబ్‌సైట్‌ని కానీ సందర్శించాలని త‌న ప్ర‌యాణికుల‌కు ఇండిగో విజ్ఞ‌ప్తి చేసింది.

Tags:    
Advertisement

Similar News