హారిస్‌తో డిబేట్‌కు నో చెప్పిన ట్రంప్‌

నెలాఖరులో షో నిర్వహిస్తామని ఫ్యాక్స్‌ న్యూస్‌ ఆఫర్‌ చేసిన కొన్నిగంటల్లోనే నిర్ణయాన్ని వెలువరించిన మాజీ అధ్యక్షుడు

Advertisement
Update:2024-10-10 10:51 IST

కమలా హారిస్‌తో డిబేట్‌కు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నో చెప్పారు. ఫాక్స్ న్యూస్ ఇద్దరు అధ్యక్ష పోటీదారులను అక్టోబర్ 24 లేదా అక్టోబరు 27న జరిగే రెండవ చర్చలో పాల్గొనమని ఆహ్వానించింది.ఈ నెలాఖరులో షో నిర్వహిస్తామని ఫ్యాక్స్‌ న్యూస్‌ ఆఫర్‌ చేసిన కొన్నిగంటల్లోనే ట్రంప్‌ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఓటింగ్‌ కూడా మొదలైందని.. మళ్లీ డిబేట్‌ కుదరని పని అంటూ ట్రంప్‌ తేల్చిచెప్పారు.వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌లు బరిలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. 

కమలా హారిస్‌ ప్రచారానికి విరాళాలు వెల్లువ

మరోవైపు కమలా హారిస్‌ ప్రచారానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బిలియన్‌ డాలర్లు వసూలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ వైదొలిగి జులై 21న కమలా హారిస్‌ పేరును ప్రతిపాదించారు. మొదటిరోజే 25 మిలియన్‌ డాలర్ల విరాళాలు రాగా.. నెల రోజుల్లోనే 500 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. రిపబ్లికన్‌ పార్టీ ఆగస్టు నాటికి 130 డాలర్లు సేకరించింది. ట్రంప్‌ చేతిలో నెలాఖరుకు 295 మిలియన్‌ డాలర్ల నగదు ఉన్నది. అప్పటికే హారిస్‌ క్యాంపెయిన్‌కు 404 మిలియన్‌ డాలర్ల సంపద పోగైంది. తాజాగా 1 బిలియన్‌ డాలర్ల (రూ.8395 కోట్లు) మైలురాయిని హారిస్‌ ప్రచార బృందం చేరుకున్నది.  

Tags:    
Advertisement

Similar News