సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్థులన్న ట్రూడో
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో మోడీ, జైశంకర్ భాగమైనట్లు కెనడా మీడియాలో వచ్చిన వార్తలపై ఆగ్రహం
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్ భాగమైనట్లు కెనడా మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్థులంటూ ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం వల్ల తప్పుడు కథనాలు చూశానని అన్నారు. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అలా చేసే వార్తాపత్రికలకు అత్యంత రహస్యమైన తప్పుడు సమాచారం లీకవకుండా నిరోధించగలమని ట్రూడో అన్నారు. నిజ్జర్ హత్యలో మోడీ, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుల ప్రమేయం ఉన్నట్లు కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. అందులో ఏకంగా భారత ప్రధాని మోడీ పేరు ప్రస్తావించడం గమనార్హం. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే అది అవాస్తవమైన వార్త అని ఇప్పటికే కెనెడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది.