యూఏఈలో ఉంటున్నవారికి గుడ్ న్యూస్.. ఓవర్ స్టే వీసాల్లో కీలక మార్పు

వీసాలపై వచ్చి గడువు దాటినా యూఏఈలోనే ఉండిపోయేవారికి యూఏఈ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకుంది. 100 దిర్హమ్‌‌ల చొప్పున జరిమానా విధించే ఓవర్ స్టే ఫైన్‌ను 50 దిర్హమ్‌లకు తగ్గించింది.

Advertisement
Update:2022-11-08 17:45 IST

భారతీయులతో పాటు ఇతర దేశాల్లోని చాలా మంది ఉన్న ప్రాంతంలో పని దొరక్క.. దొరికినా ఆ చాలీచాలని డబ్బుతో ఇల్లు గడపలేక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. ఈ క్రమంలోనే వారికి గల్ఫ్ దేశాలు తమ సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే యూఏఈకి చాలా మంది వెళుతూ ఉంటారు. అక్కడ కాస్త స్థిరపడిన మీదట తమ కుటుంబ సభ్యులను టూరిస్ట్ వీసాపై రప్పించుకుంటారు.

అయితే అలా యూఏఈకి వెళ్లిన ప్రవాసుల కుటుంబ సభ్యులు వీసా గడువు దాటినప్పటికీ తెలిసీ తెలియక అక్కడే ఉండిపోతారు. అలా గడువు దాటినా అక్కడే ఉండిపోయిన వారి వీసాలపై జరిమానా విధించడం సర్వసాధారణం. అయితే యూఏఈలో ఆ జరిమానా మొన్నటి వరకూ 100 దిర్హమ్‌లు ఉండేది. ఇంత చెల్లించాలంటే అక్కడి కొందరు భారతీయులకు చాలా కష్టమై పోయేది. తమ కుటుంబ సభ్యులకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుందని దాచుకున్న డబ్బు ఈ జరిమానాలకు కట్టాల్సి వచ్చేది.

అయితే యూఏఈ ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే వార్త చెప్పింది. ఇక మీదట ఆ జరిమానాను 50 దిర్హమ్‌లకు తగ్గించింది. అలాగే రెసిడెన్సీ పర్మిట్‌లపై ఫైన్‌ను 25 దిర్హమ్‌ల నుంచి 50 దిర్హమ్‌లకు పెంచింది. అన్ని రకాల వీసా ఓవర్ స్టే ఫైన్‌లను సంబంధిత కార్యాలయాల్లో కానీ వెబ్‌సైట్/అప్టికేషన్‌ల ద్వారా కానీ చెల్లించొచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News