వాళ్లకు న్యూ ఇయర్ వచ్చేసింది
ఇండియా చీకటి పడకముందే ఆ దేశాల్లో కొత్త ఏడాది
Advertisement
మరికొన్ని గంటల్లోనే 2024కు బై బై చెప్పేసి 2025కు వెల్ కమ్ చెప్పేందుకు భారతీయులంతా సిద్ధమవుతున్నారు. జోరుగా.. హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే వేడుకలు జరుపుకుంటున్నారు. ఇండియాలో చికటి పడకముందే రెండు ప్రాంతాల ప్రజలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేశారు. వాళ్లకు కొత్త సంవత్సరం వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ఐలాండ్స్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సరిగ్గా పావు గంట తర్వాత న్యూజిలాండ్‌లోని చాతమ్ ఐలాండ్స్ కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ ప్రజలు 4.30 గంటలకు కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు. ఆక్లాండ్‌లోని స్కై టవర్ వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు.
Advertisement