తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తాం
ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూకూ ట్రంప్ పరోక్ష హెచ్చరిక
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రవాదిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖరారు చేశారు. అంతేకాదు త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూను ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేయడం గమనార్హం. భారత ప్రధాని మోడీతో భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులను కూడా అప్పగించే అవకాశాలున్నాయా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 26/11 ముంయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామమని ట్రంప్ పేర్కొన్నారు.ఈ ప్రకటనపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ఆయన కృజ్ఞతలు తెలిపారు.