పాక్‌ జమ్మూకశ్మీర్‌ ప్రస్తావన..మండిపడిన భారత్‌

జమ్మూకశ్మీర్ ఇప్పుడూ, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసిన భారత్‌

Advertisement
Update:2024-11-09 21:04 IST

పాకిస్థాన్‌ ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. భారత్‌ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ చర్యలపై చర్చ సందర్భంగా పాక్‌ చేసిన అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

రాజ్యసభ ఎంపీ, బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది ఘాటుగా బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మనం సమావేశమైన ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించిన పాకిస్థాన్‌కు సమాధానం చెప్పే హక్కు భారత్‌కు ఉన్నది. జమ్మూకశ్మీర్ ఇప్పుడూ, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. ఎందుకంటే అది వాస్తవాలను మార్చదు. ఐక్యరాజ్యసమితి విధివిధానాలను దుర్వినియోగం చేయడానికి పాకిస్థాన్‌ చేసే తదుపరి ప్రయత్నాలకు భారత్‌ స్పందించదు.

Tags:    
Advertisement

Similar News