భారత్‌-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఇండో-బంగ్లా సరిహద్దులో ఐదుచోట్ల కంచెల ఏర్పాటునకు భారత్‌ ప్రయత్నం.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బంగ్లాదేశ్‌

Advertisement
Update:2025-01-13 16:24 IST

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ భద్రతను పటిష్టం చేసింది. ఈ క్రమంలోనే కంచె నిర్మాణానికి చర్యలు తీసుకోగా... బంగ్లాదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ పరిణామాల మధ్యే సరిహద్దు ఉద్రిక్తతల పేరుతో భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మను బంగ్లాదేశ్‌ విదేశాంగశాఖ ఆదివారం పిలిపించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై భారత్‌ కూడా తగిన చర్యలు చేపట్టింది. ఇక్కడి బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నురల్‌ ఇస్లామ్‌ను విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు సమాచారం.

ఇండో-బంగ్లా సరిహద్దులో ఐదుచోట్ల కంచెల ఏర్పాటునకు భారత్‌ ప్రయత్నిస్తున్నదని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఢాకా ఆదివారం ఆరోపణలు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్‌ కు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే విదేశాంగశాఖ కార్యాలయానికి వెళ్లిన వర్మ.. అక్కడున్న కార్యదర్శి జషీముద్ధీన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ప్రణయ్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్‌ఎఫ్‌, బీజీబీ (బార్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌)లు ఓ అవగాహనతో ఉన్నాయి. సరిహద్దు వెంబడి నేరాల నియంత్రణకు ఈ అవగాహన, సహకారం కొనసాగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News