త‌లుపుపై స్వస్తిక్‌ గుర్తు.. సౌదీలో తెలుగు వ్యక్తి అరెస్ట్

గుంటూరుకు చెందిన అరవింద్ ఇటీవలే మెకానికల్ ఇంజినీర్‌గా సౌదీలో ఉద్యోగానికి వెళ్లారు. అల్‌ ఖోబర్‌ నగరంలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. శుభసూచకంగా ఉంటుందని ఇంటి త‌లుపు మీద స్వస్తిక్‌ గుర్తు వేశారు.

Advertisement
Update:2023-05-20 07:23 IST

హిందూమతంలో స్వస్తిక్‌ గుర్తుకు గొప్ప ప్రాధాన్యతే ఉంది. ఆ గుర్తు ఉంటే దోషాలు తొలగుతాయని భావిస్తుంటారు. అందుకే కొత్త ఇళ్లపైన ఆ గుర్తును ముద్రిస్తుంటారు. అదే ఒక తెలుగు కుటుంబానికి సౌది అరేబియాలో ఇబ్బందిని తెచ్చిపెట్టింది. అక్కడి పోలీసులు తెలుగు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

గుంటూరుకు చెందిన అరవింద్ ఇటీవలే మెకానికల్ ఇంజినీర్‌గా సౌదీలో ఉద్యోగానికి వెళ్లారు. అల్‌ ఖోబర్‌ నగరంలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. శుభసూచకంగా ఉంటుందని ఇంటి త‌లుపు మీద స్వస్తిక్‌ గుర్తు వేశారు. పక్క ఇంటిలో ఉంటున్న సౌదీ దేశస్తుడు స్వస్తిక్‌ను నాజీల గుర్తుగా అర్థం చేసుకున్నాడు. దాన్ని తొలగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అరవింద్ దాన్ని తొలగించకుండా స్వస్తిక్‌ సింబల్‌ ప్రాధాన్యతను వివరించే ప్రయ్నతం చేశారు. తమకు హిట్లర్‌, నాజీల సిద్ధాంతాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

సంతృప్తి చెందని సదరు వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అరవింద్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు సామాజిక కార్యకర్త ముజమ్మీల్‌ షేక్‌.. అల్‌ ఖోబర్‌ పోలీసులను సంప్రదించారు. అరవింద్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాజీల గుర్తుకు, స్వస్తిక్ గుర్తుకు మధ్య ఉన్న తేడాను పోలీసులకు వివరించారు. అ రెండింటి మధ్య పోలికల్లో తేడాలను చూపించారు. పోలీసులు కూడా స్వస్తిక్ గుర్తును తప్పుగా అర్థం చేసుకున్నారని విచారణ తర్వాత అరవింద్‌ను వదిలిపెడతారని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News