ఇజ్రాయెల్‌లో రోజంతా సైరన్ల సౌండ్స్‌

హెజ్‌బొల్లా వదిలిన ఓ మానవరహిత వైమానిక విమానం ఆర్మీ బేస్‌ను తాకడంతో నలుగురు సైనికులు మృతి.

Advertisement
Update:2024-10-14 09:06 IST

ఇజ్రాయెల్‌లో నిరంతరాయంగా సైరన్లు మోగుతున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌ తో పాటు హైఫాలో తాజాగా సైరన్లు మోగడం మొదలైందని ఐడీఎఫ్‌ సోషల్‌మీడియాలో వెల్లడించింది. హెజ్‌బొల్లా వదిలిన ఓ మానవరహిత వైమానిక విమానం ఆర్మీ బేస్‌ను తాకడంతో నలుగురు సైనికులు మృతి చెందారు.

నస్రల్లా ఆడియో సందేశం విడుదల

సన్నల్లా ఆడియో సందేశాన్ని హెజ్‌బొల్లా విడుదల చేసింది. హైజ్‌బొల్లా సైనిక విన్యాసాల సందర్భంగా 'మీ ప్రజలను, కుటుంబాలను, దేశాన్ని, విలువలను, గౌరవాన్ని రక్షించడానికి, ఈ పవిత్రమైన, దీవించిన భూమిని రక్షించడానికి మీరు ఉన్నారని విశ్వసిస్తున్నా' అని సందేశంలో నస్రల్లా వ్యాఖ్యానించారు.

టెల్‌ అవీవ్‌కు 'థాడ్‌' రక్షణ వ్యవస్థ

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ థాడ్‌ (టెర్మినల్‌ హైఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌)ను ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థను ఆపరేట్‌ చేయడానికి సుమారు 3 వేల మంది అమెరికా సైనికులు ఇజ్రాయెల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై స్పందించిన ఇరాన్‌ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్‌క సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌ దాడుల్లో5 మంది ఐరాస సైనికులకు గాయాలు

మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు సంబంధించి ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. దక్షిణ లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల (యూనిఫిల్‌)పై ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) చేసిన దాడుల్లో 15 మంది ఐరాస సైనికులు గాయపడ్డారు. రమిమాలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

హమాస్‌ 9\11 తరహా దాడికి కుట్ర పన్నిందా?

గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడితో గాజాలో యుద్ధం మొదలైంది. ఆ దాడిలో హమాస్‌ 1200 మందిని హతమార్చింది. 250 మంది అపహరించింది. అయితే అంతకంటే పెద్ద మారణ హోమాన్నే హమాస్‌ రచించిందా? అమెరికాపై జరిగిన 9\11 తరహా దాడికి కుట్ర పన్నిందా? ఇజ్రాయెల్‌లోని బహుళ అంతస్తుల భవనాలను లక్ష్యంగా చేసుకున్నదా? అంటే ఔననే అంటున్న ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌). ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్‌ యూనిస్‌లోని హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి ఐడీఎఫ్‌ స్వాధీనం చేసుకున్నది. 

Tags:    
Advertisement

Similar News