కుప్పకూలిన యుద్ధ ఖైదీల విమానం.. - 74 మంది మృతి

ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందనేది గుర్తించేందుకు స్పెషల్‌ మిలిటరీ కమిషన్‌ ఘటనా స్థలానికి బయలుదేరిందని వివరించింది.

Advertisement
Update:2024-01-24 20:16 IST

యుద్ధ ఖైదీలతో వెళుతున్న రష్యా విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు సహా మొత్తం 74 మంది ఈ ఘటనలో మృతిచెందారు. మృతుల్లో యుద్ధ ఖైదీలు 65 మంది కాగా, తమ సిబ్బంది 9 మంది ఉన్నారని రష్యా వెల్లడించింది.

ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందనేది గుర్తించేందుకు స్పెషల్‌ మిలిటరీ కమిషన్‌ ఘటనా స్థలానికి బయలుదేరిందని వివరించింది.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్న విషయం అందులో అర్థమవుతోంది. ఈ ప్రమాదం నివాస ప్రాంతాల వద్ద జరిగింది. విమానం నేలను తాకిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఉక్రెయిన్‌ ఖైదీలను బెల్గోరాడ్‌ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు చెబుతుండగా, ఆ విమానంలో ఉన్నది యుద్ధ ఖైదీలు కాదని, రష్యా క్షిపణులను తరలిస్తోందని ఉక్రెయిన్‌లోని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ విమానాన్ని తమ రక్షణ బలగాలు కూల్చివేశాయని ఆ కథనాలు వెల్లడించాయి.

Tags:    
Advertisement

Similar News