ఉక్రెయిన్‌ పై మళ్లీ విరుచుపడిన రష్యా

188 డ్రోన్లతో 17 ప్రాంతాల్లో దాడులు

Advertisement
Update:2024-11-26 20:19 IST

ఉక్రెయిన్‌ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. చిమ్మచీకట్లో ఒకేసారి 188 డ్రోన్లతో 17 ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. రష్యా ప్రయోగించిన అనేక డ్రోన్లను తమ సైన్యం అడ్డుకుందని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. డ్రోన్‌ దాడులతో అనేక భవనాలతో పాటు నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌, రోడ్లు, బ్రిడ్జీలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. ఈ డ్రోన్‌ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నది. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ దాడుల కోసం సిద్ధంగా ఉంచిన 39 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ పై కొన్నాళ్లుగా రష్యా దాడులు చేస్తోంది. ఈ దాడులను ఉక్రెయిన్‌ దీటుగా తిప్పికొడుతోంది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌ కన్నా రష్యానే ఎక్కువగా సైనికులను కోల్పయింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పై అణుదాడికి కూడా పుతిన్‌ సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News