ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్
Advertisement
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో భద్రతా మండలిలో సమాన ప్రాతినిధ్యం గురించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని గుర్తుచేశారు. దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా 1962 నుంచి భద్రతా మండలిలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. అలాగే భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరారు.
Advertisement