సిరియా మాజీ అధ్యక్షుడిపై విష ప్రయోగం?
అంతర్జాతీయ మీడియాలో వార్తలు
Advertisement
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై విష ప్రయోగం జరిగినట్టుగా తెలుస్తోంది. సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన స్వదేశాన్ని వీడి రష్యాలో షెల్టర్ తీసుకున్నారు. రష్యాలోనే ఆయనపై విష ప్రయోగం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనలు వెలువడ్డాయి. దీంతో ఆయన ఊపిరి తీసుకోవాడానికి ఇబ్బంది పడ్డాడని, తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నాడని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఆయన కండిషన్ క్రిటికల్ గానే ఉందని, ట్రీట్‌మెంట్ చేస్తున్నారని సమాచారం. దీనిపై రష్యా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Advertisement