కమలా హారిస్‌ తరఫున ఒబామా ప్రచారం

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు

Advertisement
Update:2024-10-11 09:19 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఒబామా ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయి. ఎందుకంటే చాలామంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారు. ట్రంప్‌ మీకు మేలు చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన తన సొంత ఉపాధ్యక్షుడిపైన ఎవరైనా దాడి చేస్తేనే పట్టించుకోరు. ఆయన తన అహం,డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారు. అలాంటి వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడని ఎలా అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలా హారిస్‌ మాత్రమే అలా చేయగలరిన నేను నమ్ముతున్నట్లు ఒబామా తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News