అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు!

Advertisement
Update:2024-11-16 10:57 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన కార్యవర్గంలో భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామికి, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్ లకు కీలక బాధ్యతలు కేటాయించిన విషయం విదితమే. వీరిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) సంయుక్త సారథులుగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో వీరు కీలక మార్పులు తీసుకురానున్నారనే వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే అగ్రరాజ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు పెట్టే అవకాశం ఉన్నదనిఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్‌ ఎస్టేట్‌ మారలోగోలో జరిగిన కార్యక్రమంలో వివేక్‌ రామస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షల మంది ఫెడరల్‌ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలిగించే స్థాయిలో నేను, ఎలాన్‌ మస్క్‌ ఉన్నాం. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నామని ఉద్యోగుల కోతలపై సంకేతాలు ఇచ్చారు.

మీకు ఎలాన్‌ మస్క్‌ గురించి ఇంకా తెలుసో లేదో! ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీకి వినియోగించాలనుకుంటున్నాం. గత నాలుగేళ్లలో మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది. మనం ఇప్పుడు పతనం ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో మనం కొనసాగకూడదు. మంచిరోజులు ముందున్నాయి. అమెరికాలో కొత్త పొద్దు పొడవనున్నది. నిబద్ధత, కఠిన శ్రమతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేం సిద్ధమౌతున్నామన్నారు. జాతితో సంబంధం లేకుండా నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆశయమని రామస్వామి వివరించారు.

ఇప్పటికే ఈ డోజ్‌ విభాగం కోసం ఉద్యోగుల నియమకాలూ మొదలుపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. మస్క్‌, వివేక్‌ కోసం 80 గంటలు పనిచేసే వారు, హై ఐక్యూ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని ఆ పోస్టులో పేర్కొనడం విశేషం..

Tags:    
Advertisement

Similar News