తుపాకీ సంస్కృతికి అంతానికి అమెరికాలో కొత్త చట్టం

యూఎస్‌లో తుపాకుల సమస్యను పరిష్కరించడానికి ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

Advertisement
Update:2024-09-27 08:56 IST

అమెరికాలో నిత్యం ఎక్కడో ఓ చోట కాల్పుల మోత మోగుతూనే ఉంఉటంది. ఈ ఘటనల్లో అమాయక పౌరులు మరణించడమో, గాయాయాలపాలవ్వడమో జరుగుతుంది. అక్కడ కాల్పులు అనేది సర్వసాధారణ అంశంగా మారిపోయింది. తుపాకీ సంస్కృతికి చిన్నపిల్లలు కూడా బానిసలవుతున్నారు. ఈ హింసకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొత్త చట్టంపై సంతకం చేశారు.

అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల వల్ల మృతి చెందుతున్న చిన్నారుల కంటే తుపాకీల కారణంగా చోటు చేసుకుంటున్న మృతుల సంఖ్య ఎక్కువ. ఇది చాలా బాధాకరం. తుపాకీ హింసకు ముగింపు పలకాలంటే అమెరికాలో ముందుగా తుపాకీల సమస్య గురించి మాట్లాడాలి. ఈ హింసను అంతం చేయడానికి తాను, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కృషి చేస్తున్నామని, మీరూ మాతో చేతులు కలపండి అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనికి సంబంధించి తుపాకుల సమస్యను పరిష్కరించడానికి ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, డిసెంబర్‌ వరకు ప్రభుత్వానికి నిధులు అందేలా రూపొందించిన స్టాప్‌గ్యాప్‌ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. ఈ బిల్లు ఆధారంగా డిసెంబర్‌ 20 వరకు ప్రభుత్వానికి నిధులు అందుతాయని ది గార్డియన్‌ నివేదించింది.

Tags:    
Advertisement

Similar News