ఆమెకు గంటకు రూ.12,000 తెచ్చిపెడుతున్న కౌగిలింతల వైద్యం..

మిస్సీ రాబిన్సన్‌కు క్లెయింట్స్ ఏమీ తక్కువగా లేరు. చాలా ఎక్కువగానే ఉన్నారట. తనను అప్రోచ్ అయిన ఒక క్లైంట్‌ను ఓ రాత్రి మొత్తం కౌగిలించుకున్నందుకు ఈమె 1.5 లక్షల రుపాయలు తీసుకుందట.

Advertisement
Update:2022-11-14 14:58 IST

తెలివి ఉండాలే కానీ ఎడారిలో సైతం ఇసుక అమ్మేసి బతికేయగలరు కొందరు. మీరు మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. దానిలో ఎవరైనా బాధలో ఉంటే వారిని కౌగిలించుకుంటే వారి మనసుకు సాంత్వన చేకూరి బాధంతా ఎగిరిపోతుందని చెబుతారు. ఇది అక్షరాల నిజమంటోంది ఆస్ట్రేలియాకు చెందిన మిస్సీ రాబిన్సన్ (43). ఎందుకంటే ఆమె ప్రస్తుతం అదే చేస్తోంది. అలా చేసినందుకు గంటకు రూ.12000 చార్జ్ చేస్తోంది. అవాక్కయ్యారా? ఇది అక్షరాలా నిజం.

మిస్సీ రాబిన్సన్ అనే మహిళ మానసిక ఆరోగ్య కార్యకర్త. ఈ క్రమంలోనే మానసిక సమస్యలతో బాధపడేవారికి సాయం చేస్తూనే తను కూడా ఎంతో కొంత సంపాదించుకోవాలనుకున్నారు. బాధలో ఉన్నవారిని కౌగిలించుకుని కాస్త ఓదారిస్తే వారి మనసుకు సాంత్వన చేకూరుతుందని భావించిన ఆమె కడెల్ థెరపీ ప్రారంభించారు. సాధారణంగా ఆడవారు తమ భావోద్వేగాలను బయటపెట్టినట్టు మగవారు బయటపెట్టలేరు. కానీ వారికి కూడా ఓదార్పు అవసరమే కదా.. అలాంటి వాళ్శకు మిస్సీ మంచి ఆప్షన్‌గా మారింది. గంటకు రూ.12000 చొప్పున వారిని ఎంత సేపు కౌగిలించుకుంటే అంత డబ్బు తీసుకుంటుంది.

మిస్సీ రాబిన్సన్‌కు క్లెయింట్స్ ఏమీ తక్కువగా లేరు. చాలా ఎక్కువగానే ఉన్నారట. తనను అప్రోచ్ అయిన ఒక క్లైంట్‌ను ఓ రాత్రి మొత్తం కౌగిలించుకున్నందుకు ఈమె 1.5 లక్షల రుపాయలు తీసుకుందట. ఆమెను సంప్రదిస్తున్నవారిలో 20 నుంచి 50 ఏళ్ల లోపు వారే ఎక్కువట. ఈ కడెల్ థెరపీతో మానసిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని మిస్సీ తెలిపారు. సరైన సమయంలో ఇలాంటి ఊరట లభించని వారిలో కొందరు ఉన్మాదులుగానూ.. సైకో కిల్లర్‌లుగా మారుతున్నారని కూడా ఆమె చెప్పారు. ఇక క్లైంట్స్ ఈమెను కొందరు బయట కలవడానికి.. మరికొందరు ఇంటికే పిలిపించుకుంటున్నారట. ఆస్ట్రేలియా మానసిక ఆరోగ్యసంస్థకు మిస్సీ ప్రస్తుతం అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News