ట్విట్టర్ ని మరచిపొండి..! కొత్త యాప్ వచ్చేస్తోంది..

2016లో ట్విట్టర్ కి పోటీగా మాస్టోడాన్ అనే యాప్ తెరపైకి వచ్చింది. డీసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మెటా తీసుకొచ్చే యాప్ కూడా మాస్టోడాన్ తరహాలోనే ఉంటుందని సమాచారం.

Advertisement
Update:2023-03-11 07:26 IST

సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రకాల యాప్ లు వచ్చినా.. ట్విట్టర్ కి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. ఆమధ్య ఎలన్ మస్క్ ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం కాస్త గందరగోళంగా ఉన్నాయి. బ్లూ టిక్ ని అమ్మకానికి పెట్టి బాగానే సొమ్ము చేసుకుంటున్న మస్క్ కి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది మెటా. ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సప్ లతో సోషల్ మీడియాలో హవా చూపిస్తున్న మెటా సంస్థ.. టెక్స్ట్ ప్రాధాన్యంగా మరో యాప్ ని తీసుకొచ్చి ట్విట్టర్ ని ఢీకొట్టాలనుకుంటోంది.

ఫేస్ బుక్, ఇన్ స్టా సహా ఇతర మాధ్యమాలు ఉన్నా కూడా అధికారిక సమాచారం కావాలంటే ఎవరైనా ట్విట్టర్లోనే వెదుకుతారు. అధికారులు, రాజకీయ నేతలకు సంబంధించి అధికారిక ధృవీకరణ సమాచారం ట్విట్టర్లోనే దొరుకుతుంది.


విశ్వసనీయ సమాచారం కావాలనుకునేవారి ఫస్ట్ ప్రయారిటీ ట్విట్టర్ మాత్రమే. వీడియో, ఫొటోలకంటే టెక్స్ట్ కే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ట్విట్టర్ ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇదే పద్ధతిలో ఇప్పుడు మెటా కొత్త యాప్ ని తయారు చేస్తోంది. త్వరలోనే దీని పేరు ప్రకటిస్తుంది.

2016లో ట్విట్టర్ కి పోటీగా మాస్టోడాన్ అనే యాప్ తెరపైకి వచ్చింది. డీసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి 20లక్షలమంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కానీ చాలామందికి అసలు ఇలాంటి యాప్ ఒకటి ఉంది అని కూడా తెలియదు. ఇప్పుడు మెటా తీసుకొచ్చే యాప్ కూడా మాస్టోడాన్ తరహాలోనే ఉంటుందని సమాచారం. టెక్స్ట్ అప్ డేట్స్ కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టు తెలిపారు మెటా ప్రతినిధులు.

ఫేస్ బుక్ సంస్థ ఇన్ స్టా, వాట్సప్ లను కలిపేసుకుని ఆ తర్వాత మెటాగా మారి సోషల్ మీడియాపై పెత్తనం చలాయిస్తోంది. వీటి మధ్యలో ట్విట్టర్ ఒక్కటే వారికి పంటికింద రాయిలా ఉంది. ట్విట్టర్ కి కూడా పోటీ ఇస్తే తమ యాక్టివ్ యూజర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తోంది మెటా.

Tags:    
Advertisement

Similar News