కాలిఫోర్నియాలో భారీ భూకంపం

రిక్టేర్‌ స్కేల్‌పై తీవ్రత 7కు పైగా నమోదు

Advertisement
Update:2024-12-06 07:35 IST

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. రిక్టేర్‌ స్కేల్‌పై తీవ్రత 7కు పైగా నమోదైంది. ఈ మేరకు అమెరికా భూ సర్వేక్షణ విభాగం వెల్లడించింది. జాతీయ సునామీ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్‌ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే దీని ప్రభావంతో ఏర్పడిన ప్రాణ, ఆస్తి నష్టాల సమాచారం తెలియాల్సి ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News